Share News

ఆన్‌లైన్‌ కోచింగ్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:00 AM

ఆన్‌లైన్‌ కోచింగ్‌ తరగతులను సద్వినియోగ పరుచుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కు మార్‌ ఝా అన్నారు.

ఆన్‌లైన్‌ కోచింగ్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

బోయినపల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ కోచింగ్‌ తరగతులను సద్వినియోగ పరుచుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కు మార్‌ ఝా అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఆన్‌ అకాడమీ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మంగళ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమా ర్‌ ఝా మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పిల్లలకు పోటీ పరీక్షల రాసేందుకు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా మంచి శిక్షణ ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆన్‌లైన్‌ తరగతుల్లో దేశంలోని నిపుణులైన టీచర్లతో పిల్లలకు బోధన జరుగుతోందని, ఢిల్లీలో విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకుని సిరిసిల్ల జిల్లాలోని పిల్లలకు కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థి జీవితంలో 10,11,12వ తరగతు లు 3సంవత్సరాలు చాలా కీలకమన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. మాడల్‌ స్కూల్‌లో విద్యార్థులకు ఫ్యాన్లు లేవని తెలుపగా వెంటనే 50 ఫ్యాన్లు మంజూరుచేయాలని అధికారులకు ఆదే శాలు జారీచేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడు తూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకు నిరంతరం కృషి చేస్తూ పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్‌ ప్రత్యేక చోరువ చూపారన్నారు. మోడల్‌ స్కూల్లో విద్యార్థులకు కల్పించి న సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని భవిష్యత్తులో ఉన్న త స్థానాలకు ఎదగాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. అనంత రం పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేలు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మండ ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 01:00 AM