Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:07 AM

అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫ్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై మున్సిపల్‌ కమిషనర్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, గ్రామ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫ్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై మున్సిపల్‌ కమిషనర్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, గ్రామ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఎఫ్‌టీఎల్‌, నిషేధించిన సర్వే నంబర్లు మినహా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్‌ రుసుము నిర్ణయించామని అన్నారు. రుసుము ఎంత అనేది ఎవరైనా తమ సెల్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అయి పరిశీలించవచ్చన్నారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు ఎవరైనా ఈనెల 31వ తేదీలోగా చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇస్తారని తెలిపారు. రుసుము చెల్లించిన వారి దరఖాస్తులను అధికారులు పరిశీలించి రెండు రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తారన్నారు. అనధికారిక లే అవుట్లు చేసి అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశముందని వివరించారు. ప్లాట్‌ రిజిసేన్ట్రషన్‌ సమయంలోనూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చని అన్నారు. క్రమబద్ధీకరించని భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని తెలిపారు. జిల్లాలో 68,405 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు రాగా 44,437 ఆమోదం పొందాయన్నారు. కార్యదర్శులు, వార్డు అధికారులు, ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్రమబద్ధీకరణ రుసుము నిర్ణయించిన వారందరికీ సమాచారం చేరేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో సుడా డీటీసీపీవో ఆంజనేయులు, మున్సిపల్‌ కమిషనర్లు, సబ్‌ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:07 AM