కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:23 PM
వేసవి శిబిరంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): వేసవి శిబిరంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వేసవి శిబిరం శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులు వేసవి సెలవుల్లో విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. నాలుగు వారాలపాటు జరిగే శిక్షణలో 50 మంది విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, ఫొటోషాప్ స్కిల్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, నెహ్రూ యువకేంద్ర కో-ఆర్డినేటర్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం మేనేజర్ రాంబాబు, క్వాలిటీ కో-ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, కేజీబీవీ కో-ఆర్డినేటర్ కృపారాణి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.