స్వీపర్, స్కావెంజర్‌లకు వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:31 AM
ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తున్న స్వీపర్‌లు, స్కావెంజర్‌లకు గత ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేద ని, కలెక్టర్ స్పందించి ఆ వేతనాలను చెల్లించాలని జిల్లా కన్వీనర్ లక్ష్మణ్ డిమాం డ్ చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తున్న స్వీపర్‌లు, స్కావెంజర్‌లకు గత ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేద ని, కలెక్టర్ స్పందించి ఆ వేతనాలను చెల్లించాలని జిల్లా కన్వీనర్ లక్ష్మణ్ డిమాం డ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం ఏఐటీయూసీ ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్, స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా లక్ష్మన్ మాట్లాడు తూ గత నాలుగుసార్లు వేతనాలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్‌లు, స్కావెంజర్‌లకు రావా ల్సిన వేతనాలను ఇప్పించి ఆదుకోవాలని కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రాన్ని అందిం చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేష్, దేవయ్య, రాజు, మహేష్, పర్శరాములు, సాయికృష్ణ, రాజు, లత, లావణ్య, అనిత, లక్ష్మీ, రాధిక, జ్యోతి, శ్యామల, శోభ, పోచవ్వ, నర్సవ్వ, కవిత, మహేశ్వరీ, సునీత, స్వర్ణ, మల్లే శ్వరీ, రేణుక తదితరులు పాల్గొన్నారు.