Share News

రౌడీషీటర్లపై నిఘా తీవ్రతరం

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:19 AM

రౌడీ షీటర్స్‌ ఆగడాలు మితి మీరిపోతున్నాయి.

రౌడీషీటర్లపై నిఘా తీవ్రతరం

వేములవాడ క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : రౌడీ షీటర్స్‌ ఆగడాలు మితి మీరిపోతున్నాయి. మత్తుపదార్థాల మాయలో పడిన యువత కత్తిపోట్లు, దాడులకు తెగబడుతున్నారు. గంజాయి మత్తులో యువత పెడదారి పడుతుం ది. నిజామాబాద్‌లో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కిన రియాజ్‌ ఓ కానిస్టేబుల్‌ను దారణంగా హత్యచేయడాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నా రు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ పోలీసులు రౌడీ షీటర్‌లపై నిఘా పెంచారు. రౌడీ షీట్స్‌ కదలికలను గమనిస్తున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన హత్యలు బెంబే లెత్తిస్తున్నాయి. ఈ హత్యలను పోలీసులు చేధిస్తున్నప్పటికీ నేరాలు ఆగ డం లేదు. గత పదినెలల్లో జిల్లా వ్యాప్తంగా 10హత్యలు జరిగాయి. ఈ నేప థ్యంలో జిల్లాలో 121 రౌడీ షీట్స్‌ తెరిచారు. మరో 3 పీడీ యాక్ట్‌ అమలు చేశారు. ఇందు లో సిరిసిల్ల-19, ఇల్లంతకుంట-16, ముస్తాబాద్‌-11, తంగళ్లపల్లి- 9, ఎల్లారెడ్డిపేట-8, గంభీరావుపేట -2, వీర్నపల్లి-3, వేములవాడ టౌన్‌ -17, వేములవాడ రూరల్‌-10, బోయిన్‌పల్లి-6, చందుర్తి-11, కోనరావుపేట-8, రుద్రం గి-1 రౌడీ షీట్స్‌ ఓపెన్‌ చేశారు.

జిల్లాలో వరుస హత్యలు..

వేములవాడ పట్టణ శివారులోని చెక్కపల్లి రహదారిలోని ఓ మిల్లు వద్ద పని చేసే ఇద్దరు కూలీల మధ్య ఘర్షణ తలెత్తి ఓ కూలిని హత్యచేశారు. వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్‌ చెరువు వెనుకాల మధ్యం మత్తులో ఓ వ్యక్తిని బండరాయితో బాది చంపేశారు. చందుర్తి మండల కేంద్రంలో భూ వ్యవహారంలో బొల్లు మల్లవ్వ అనే వృద్ధురాలును యువకుడే దారుణంగా హతమార్చాడు. సెప్టెం బరు 19న రాత్రి సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ప్రముఖ రియ ల్టర్‌ సిరిగిరి రమేశ్‌(55)ను దారుణంగా హత్యచేసి వేములవాడ నందికమాన్‌ వద్ద వదిలేసి వెళ్లారు. ఇదేవిధంగా ఈనెల 6న వేములవాడలో భానుప్రకాశ్‌ అనే యు వకుడిపై కత్తిపోట్లకు పాల్పడ్డారు.

ఆగని నేరాలు..

జిల్లాలో జరిగిన పలు హత్యలను పోలీసులు చేధిస్తున్నప్పటికీ నేరాలు ఆగడం లేదు. ఇటీవల జరిగిన రియల్టర్‌ హత్య కేసులో వెంకటేశ్‌, రవి, శివ అనే నిందితు లను అరెస్ట్‌చేశారు. చందుర్తి మండల కేంద్రంలో జరిగిన వృద్దురాలు హత్య కేసు లోనూ మనోజ్‌ అనే యువకుడిని అరెస్ట్‌చేయడమే కాకుండా పీడి యాక్ట్‌ అమలు చేశారు. గత ఏడాది సిరిసిల్లలో జరిగిన మహిళ హత్యకేసులో బిహార్‌కు చెందిన రూడల్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ విధంగా హత్య కేసులను పోలీసులు చేధిస్తున్నప్ప టీకీ హత్యా సంఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి.

నేరాలపై ప్రత్యేక నిఘా

- మహేష్‌ బి. గీతే, ఎస్పీ

జిల్లాలో చోటుచేసుకుంటున్న నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. వరుస హత్యలపై సీరియస్‌గా తీసు కున్నాం. ప్రతి సంఘటనలోనూ వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. చోరీలు అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిఘా పెంచాం.

Updated Date - Oct 27 , 2025 | 12:19 AM