Share News

వేములవాడలో వాహనదారులపై నిఘా

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:22 AM

వేములవాడలో వాహనాల వేగాన్ని నియంత్రించడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.

వేములవాడలో వాహనదారులపై నిఘా

వేములవాడ టౌన్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి) : వేములవాడలో వాహనాల వేగాన్ని నియంత్రించడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రయోగాత్మకంగా ఐదు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అతివేగంగా వెళ్లే వాహనాలను పట్టేసేందుకు ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌(ఏఎన్‌పీఆర్‌) సీసీ కెమెరాలు క్లిక్‌ అంటాయి. ఈ ఆధునిక పరికరాలతో ప్రతిరోజు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల యజమానులకు నేరుగా మెస్సెజ్‌ వెళుతుంది. అలాగే రోడ్డు ప్రమా దాల నివార ణకు చర్యలు తీవ్రతరం చేశారు. విస్తృత తనిఖీలతో పాటు కెమెరాల ద్వారా నిఘా పెంచారు.

ప్రయోగాత్మకంగా అమలు..

వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ అమలు చేస్తున్నారు. ఇందుకోసం 5 ఆటోమెటిక్‌ సీసీ కెమెరాలను బిగించారు. వీటిని కోరుట్ల బస్టాండ్‌, సాయిరక్షచౌరస్తా, తిప్పాపూర్‌ బస్టాండ్‌, మూలవాగు బ్రిడ్జి, కరీంనగర్‌, సిరిసిల్ల వైపు వెళ్లే మార్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. వేములవాడ పట్టణంతో పాటు చుట్టుపక్కల రహదారులపై నిర్ణీత వేగాన్ని మించి వెళితే కెమెరా ఆటోమెటిక్‌గా క్లిక్‌ అంటుంది. తద్వారా వాహనవేగంతో పాటు నిబంధన అతిక్రమించిన విధానాన్ని ఫొటోతో పాటు సంబంధిత వాహనదారుడికి ఈ-చలాన్‌ వెళుతుంది. వాహనదా రుడికి ఎక్కడ వేగాన్ని అతిక్రమించాననేది తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విధానంతో వేగ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఉపయోగపడనుంది.

పెట్రోలింగ్‌ తీవ్రతరం..

వేములవాడలో పెట్రోలింగ్‌ తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందుకు ట్రాఫిక్‌ పోలీసులు పట్టణ పరిధిలో రోజు ఒక మార్గంలో పెట్రోలింగ్‌లో భాగంగా విస్తృత తనిఖీలు చేపడుతారు. పెట్రోలింగ్‌పై ప్రతిరోజు కంట్రోల్‌ రూమ్‌కి, స్పెషల్‌ బ్రాంచికి సమాచారం అందించ డానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని గమనిస్తూ నేరాల నియంత్రణ చేస్తారు. వాహనాల వేగాన్ని నియం త్రించడానికి అందుబాటులో ఉన్న సిబ్బందితో పెట్రోలింగ్‌ నిర్వహిస్తా రు. ఏరోజు ఏరూట్లో బీట్లు, పెట్రోలింగ్‌ చేశారో ఎప్పటికప్పుడు సంబం ధిత రికార్డులో నమోదుచేస్తారు. రహదారులపై నిర్ణయించినవేగాన్ని మించితే తప్పనిసరిగా కెమెరా క్లిక్‌ అవుతుంది.

బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తింపు..

రోడ్డు ప్రమాదాల నివారణకు వేములవాడ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తిస్తున్నారు. రోడ్డు భద్రత నియమాల దృష్ట్యా బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించి అక్కడ ప్రమాదాలు జరిగే కారణాన్ని, నివారణ మార్గా న్ని అన్వేషిస్తున్నారు. బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది ప్రజలతో సమన్వ యంగా ఉంటూ ప్రమాదాలను నివారించడానికి తోడ్పడుతారు.

ప్రతి రోజు స్పెషల్‌ డ్రైవ్‌..

వాహనాల వేగ నియంత్రణతో పాటు నిబంధనల అతిక్రమణను అరికట్టేందుకు ప్రతిరోజు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగానే వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్‌ మా ట్లాడే వారిపై నిఘా పెట్టారు. ద్విచక్రవాహనం, కార్లు, ట్రాక్లర్లు, బస్సు లు, ఇతర వాహనాలను ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తున్నారని ఈ చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనా లు నడుపడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఈ ప్రమాదాలను తగ్గించడానికి సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలను నడిపేవారిపై నిఘా తీవ్రతరం చేశారు. ఇంతేకాకుండా హెల్మెట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, అతివేగం, డ్రంకెన్‌ డ్రైవ్‌, సీట్‌బెల్ట్‌, తదితర వాటిపై ట్రాఫిక్‌ పోలీసులు దృష్టిపెట్టారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం

- మహేష్‌ బి. గీతే, ఎస్పీ

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం గా పెట్టుకున్నాము. జిల్లా వ్యాప్తంగా తనిఖీ లు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలతో పాటు ఇతర ముఖ్యకూడళ్లలో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆటోమెటిక్‌ సీసీ కెమెరాల ద్వారా వాహనాల వేగంపై నిఘా పెడుతాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీవ్రతరం చేశాం.

Updated Date - Nov 03 , 2025 | 12:22 AM