‘ఉపాధి’పై నిఘా
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:29 AM
ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పనుల వివరాలను యాప్‌లో సంక్షిప్తం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక సిబ్బందికి వారం రోజుల పాటు శిక్షణ ఇస్తోంది.
కరీంనగర్ రూరల్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పనుల వివరాలను యాప్‌లో సంక్షిప్తం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక సిబ్బందికి వారం రోజుల పాటు శిక్షణ ఇస్తోంది. భవన్ యాప్‌లో వివిధ రకాల పనుల వివరాలు నమోదు చేస్తుండగా ఆదే యాప్‌లో యుక్తదారలో పనుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ రూరల్ మండలంలో చేగుర్తి గ్రామాన్ని పైలట్‌గా ఎంపిక చేసింది. ఇప్పటికే పనుల గుర్తింపు, కూలీల వివరాలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఏరియా చూపించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి పనులు పూర్తి చేసిన తరువాత వివరాలను యాప్‌లో నమోదు చేసేవారు. ప్రస్తుతం పనుల వివరాలను ముందుగానే శాటిలైట్ ద్వారా యుక్తదార యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకసారి చేసిన పనిని మళ్లీ నమోదు చేయాలని చూస్తే యాప్ తీసుకోదు. ప్రస్తుతం మండలంలో సాకేంతిక సలహదారులు (ఈసీ), సాంకేతిక సహాయకులు (టీఏ)లకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు 90శాతం ఉపాధిహామి పథకం ద్వారానే చేస్తున్నారు. వంద మంది కూలీలు పనులకు వెలితే హజరు నమోదు ఒక్కో క్షేత్ర సహాయకుడికి గంటకు పైగా పడుతుంది. పనుల కొలతలు, పనుల కోసం దరఖాస్తు తీసుకోవడం, చెల్లింపులు తదితర పనుల భారం పెరిగింది. దీంతో ఉపాధిహామిలో ఈ యాప్‌ల ద్వారా నేరుగా ఉపాధి కూలీల అటెండెన్స్, పనుల వివరాలు, చేసిన పనులు నిక్షిప్తం చేయబడతాయి. ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారు.
ఫ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు
- శోభరాణి, ఎంపీవో
భువన్ యాప్ ద్వారా పనులను చేపట్లేందుకు పైలట్ ప్రాజెక్టుగా చేగుర్తి గ్రామం ఎంపిక అయ్యింది. గతంలో పనుల గుర్తింపు, మంజూరు తరువాత కో ఆర్డినేట్స్ పని ప్రదేశం అక్షంశాలు, రేఖాంశాల ఆధారంగా నమోదు చేసుకొని పనులు ప్రారంభిచేవవాళ్లం. ప్రస్తుతం యుక్తదారలో పనుల గుర్తింపు ప్రక్రియలోనే అంచనాలు రూపొందించుకుని మంజూరు తీసుకుంటున్నాం. దీని ద్వారా పనుల గుర్తింపులో నాణ్యతతో పాటు, పనులు రెండో సారి చేపట్టకుండా ఉంటుంది. కూలీలకు ముఖచిత్రం ద్వారా అటెండెన్స్ వేస్తాము. టీఏలకు, సీసీలకు శిక్షణ ఇస్తున్నారు.