Share News

అక్రమాలపై నిఘా

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:38 AM

అక్రమ ఇసుక, మట్టి రవాణాపై జిల్లా అధికార యంత్రాంగం నిఘా పెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం సంయుక్తంగా దాడులు చేపడుతున్నారు.

అక్రమాలపై నిఘా

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అక్రమ ఇసుక, మట్టి రవాణాపై జిల్లా అధికార యంత్రాంగం నిఘా పెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం సంయుక్తంగా దాడులు చేపడుతున్నారు. ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసి భారీగా జరిమానా విధిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, ఎస్పీ మహేష్‌ బీ గితే సంయుక్త ఆధ్వర్యంలో సహజ వనరుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘాతో పాటు నిరంతరం దాడులు చేయడంతో అక్రమార్కులు హడలిపోతున్నారు. ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం నిబంధనల మేరకు తరలించేందుకు కలెక్టర్‌ అనుమతి ఇస్తున్నారు. నిర్మాణదారులకు ఇసుక, మట్టి కోసం ఇబ్బంది పడుకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కావాల్సిన ఇసుక, మట్టి సమకూర్చాలని ఆయా మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు.

ఫ జిల్లాలో 691 వాహనాలు సీజ్‌

జిల్లాలో అనుమతి లేకుండా మొరం, మట్టి తరలిస్తున్న 691 వాహనాలను మైనింగ్‌ శాఖ ఆధ్వర్యంలో సీజ్‌ చేసి రూ. 1,02,026 జరిమానా విధించారు. అలాగే అధికా రికంగా అనుమతి లేకుండా మొరం, మట్టి తవ్వకాలు చేస్తున్న జిల్లాలోని ఆయా మండలాల్లో నలుగురికి రూ. 2,87,515 జరిమానా విధించి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. జిల్లాలో జూలై 21న ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో హిటాచి, 12న ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో జేసీబీ, ఐదు ట్రాక్టర్లు, 28న ముస్తాబాద్‌ మండ లం చిప్పలపల్లిలో జేసీబీ, ఐదు ట్రాక్టర్లు, జూన్‌ 28న ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వాహ నాలకు బ్యానర్‌ కట్టి వేములవాడ రూరల్‌ మండలంలోని కొడిముంజ, అనుపురం పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న 10టిప్పర్లు, రెండు ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, రెండు హిటాచిలను, ఇదే నెల 22న ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో హిటా చీ, జేసీబీ, అలాగే ఒక టిప్పర్‌ ను సీజ్‌ చేసి, పోలీస్‌ స్టేషన్లకు, ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

అక్రమ రవాణాను ఉపేక్షించం

- జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

జిల్లాలో అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తే ఉపేక్షించం. కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ సెలవు దినాల్లో ఇసుక, మట్టి తరలించవద్దు. ప్రభుత్వ పనిదినాలలో మాత్రమే అనుమతులు ఇస్తాం.

Updated Date - Aug 05 , 2025 | 01:38 AM