సురవరం మృతి తీరని లోటు
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:06 AM
భార త కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ కార్యద ర్శి, మాజీ ఎంపీ సురవ రం సుధాకర్ సుధాకర్ రెడ్డి మృతి దేశంలోని కార్మిక, కర్ష వర్గానికి తీరని లోటని సీపీఐ సిరి సిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : భార త కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ కార్యద ర్శి, మాజీ ఎంపీ సురవ రం సుధాకర్ సుధాకర్ రెడ్డి మృతి దేశంలోని కార్మిక, కర్ష వర్గానికి తీరని లోటని సీపీఐ సిరి సిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో సురవరం సుధా కర్‌రెడ్డి మృతిపై సీపీఐ నాయకులు సంతాపం తెలి పారు. ఆయన చిత్రపటానికి పూలతో నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సురవ రం తండ్రి వెంకట్రామిరెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఆయన అడుగు జాడల్లోనే సురవరం సుధాకరెడ్డి నడుస్తూ ఏఐఎస్ ఎఫ్ నుండి సీపీఐ జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగాడన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సురవరం అహర్నిశలు కృషి చేశారని, తెలంగాణ ఉద్యమానికి పూర్తి మద్దతును తెలిపి ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ విభజనకు కృషి చేశారన్నారు. జాతీయ నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి మరణం సీపీఐకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు, సోమ నాగరాజు, పండుగ పోషమల్లు, ఆకుల అంజనేయులు, లాల శ్రీను, పండుగ చంద్రయ్య, దయ్యాల అంజయ్య పాల్గొన్నారు.