టెట్ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలి
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:56 AM
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు సంబంధించి వచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఎస్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమనాతిని రవి కోరారు.
వేములవాడ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు సంబంధించి వచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఎస్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమనాతిని రవి కోరారు. శనివారం వేము లవాడలో జరిగిన ఎస్‌టీయూ టీఎస్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మా ట్లాడుతూ టెట్ అర్హత లేని అందరు ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిందని, అయితే 2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు ప్రభుత్వం దీని నుంచి మిన హాయింపు ఇవ్వాలని కోరారు. కోర్టు తీర్పు ప్రస్తుత రూపంలో అమలు చేయబ డితే సామూహిక పదవీ విరమణలకు తప్పనిసరి అవుతుందని, తెలంగాణ అంతటా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతకు కారణమవుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రేవోజు సదానందం, ప్రధాన కార్యదర్శి మొగిలి లక్ష్మణ్, ఆర్థిక కార్యదర్శి బొగ్గారపు నవీన్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర బాధ్యులు రవీందర్ రెడ్డి, యాదగిరి, పిఆర్సీ కమిటీ సభ్యుడు కందుకూరి దయానంద్, అసోసియేట్ అధ్యక్షుడు అరుకుటి మల్లేశం, రాష్ట్ర బాధ్యులు చాట్ల మల్లేశం, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు.