కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:50 PM
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని ఇన్‌చార్జి కలె క్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.
వేములవాడ టౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని ఇన్‌చార్జి కలె క్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం సాయంత్రం వేము లవాడ పట్టణం రెండో బైపాస్ వద్దగల బాలనగర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ సందర్శించి పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తాము కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొం దాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 238 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 48,325 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్రింటాలుకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369గా ధర నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. సరైన తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాల న్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం కుప్పులను పరిశీలించి వసతి సౌకర్యాలు, ఇతర సమ స్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, సింగిల్ విండో కార్యదర్శి లక్ష్మణ్, తదిత రులు పాల్గొన్నారు.