Share News

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండ

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:43 AM

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండ

ఇల్లంతకుంట, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు గత ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి చెక్కుల కోసం నెలల తరబడి ఎదురుచేసేవారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముందు ఉన్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలన వల్ల రాష్ట్ర బడ్జెట్‌ అప్పుల ఊబిలోకి పోయినా ఏనాడు సంక్షేమ పథకాల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి వెనకడుగువేయలేదన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడంతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రిలలో చేరి వైద్యఖర్చులు భరించిన వారికి అండగా నిలువాలని సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం చేయూత అందిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మందు ఇచ్చిన హమీలను అమలు చేయడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. వివిద గ్రామాలకు చెందిన 33మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 84మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీసీసీ కోఆర్డీనేటర్‌ పాశం రాజేందర్‌రెడ్డి, ఏఎమ్‌సీ వైస్‌ చైర్మన్‌ ప్రసాద్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వెలిచాల జ్యోతి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, నాయకులు చిట్టి ఆనందరెడ్డి, మామిడి నరేష్‌, యాస తిరుపతి, మామిడి రాజు, వెంకట్‌రెడ్డి, విజయ్‌ఖాత మల్లేశం, తీగల పుష్పలత, నరేందర్‌రెడ్డిలతో పాటు వివిద గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:43 AM