Share News

విద్యార్థులకు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:31 AM

విద్యార్థులకు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంజేపీ గురుకులాల జాయింట్‌ సెక్రటరీ శ్యాంప్రసాద్‌లాల్‌ సిబ్బందికి సూచించారు. హుజూరాబాద్‌ పట్టణం కేసీ క్యాంపులోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల హాస్టల్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు.

విద్యార్థులకు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి
హుజూరాబాద్‌లో ఎంజేపీ బాలికల హాస్టల్‌లోని వంట గదిని పరిశీలిస్తున్న జాయింట్‌ సెక్రటరీ శ్యాంప్రసాద్‌లాల్‌

హుజూరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంజేపీ గురుకులాల జాయింట్‌ సెక్రటరీ శ్యాంప్రసాద్‌లాల్‌ సిబ్బందికి సూచించారు. హుజూరాబాద్‌ పట్టణం కేసీ క్యాంపులోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల హాస్టల్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని రికార్డులను పరిశీలించారు. పాఠశాలలోని పదో తరగతి చదివే విద్యార్థునుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ తాళ్లపల్లి శారద, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:31 AM