Share News

విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:48 AM

విద్యార్థులు కష్టించి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత ఆకాంక్షించారు. ధర్మపురి పట్టణంలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు.

విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి
ధర్మపురి పట్టణంలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో వంట గదిని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత

అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత

ధర్మపురి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు కష్టించి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత ఆకాంక్షించారు. ధర్మపురి పట్టణంలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం గురించి ప్రిన్పిపాల్‌ జ్యోతిని అదనపు కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆమె మాట్లాడి విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. అద్దె భవనంలో కొనసాగుతున్న స్కూల్‌లో మౌలిక వసతులను, మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆమె సూచించారు. స్కూల్‌ భవనంలో కొంత భాగం దెబ్బతిందని వెంటనే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ స్కూల్‌లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్కూల్‌లో విద్యార్థుల లీడర్‌షిప్‌ కోసం ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థులు, టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌తో కలిసి అదనపుకలెక్టర్‌ పోలింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మామిళ్ల శ్రీనివాస్‌రావు, మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌ సుమన్‌, ఎంపీడీవో రవీందర్‌, స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జ్యోతి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

కార్యాలయాల తనిఖీ..

జగిత్యాల (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని ఆఫీసులను అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులందరు సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. పెండింగ్‌ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ వెంట కలెక్టరేట్‌ ఏవో, సెక్షన్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:49 AM