విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:36 AM
సీవీ రామన్ అబ్దుల్ కలాం స్పూర్తితో విద్యార్థులు ప్రణాళికల ప్రకారం ప్రయోగాలు చేసి ఉన్నత స్థానా లకు ఎదగాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : సీవీ రామన్ అబ్దుల్ కలాం స్పూర్తితో విద్యార్థులు ప్రణాళికల ప్రకారం ప్రయోగాలు చేసి ఉన్నత స్థానా లకు ఎదగాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం గీతనగర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశా ల విద్యా శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇన్‌స్పేర్(ఆర్‌ఎస్‌బీవీపీ)విద్యా వైజ్ఞానిక ప్రద ర్శన-2025 ప్రాజెక్ట్ కాంపిటేషన్‌ను(రెండు రోజులు) ముఖ్య అతిథి ఇన్‌చార్జి కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థు లు ప్రారంభోత్సవంలో భాగంగా చేసిన నృత్యాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్‌ను ఇంచార్జి కలెక్టర్, అధికారులు ఆసక్తిగా పరిశీలించా రు. విద్యార్థులు చేసిన ఎగ్జిబిట్స్‌ను ఎలా తయారు చేశారు...? వాటి వల్ల విని యోగం ఏంటి...? కలిగే ఫలితాలు ఏంటీ...? అని అడిగి వివరాలను తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లా డుతూ విద్యార్థులు తరగ తులలో నేర్చుకున్న పాఠ్యాంశాలపై ప్రయోగా లు చేయాలని ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలపై అవగాహన వస్తుందన్నా రు. జిల్లాలో సైన్స్ మ్యూజి యం ఏర్పాటు చేయడం కోసం కావాల్సిన స్థలం కోసం ప్రతిపాదనలను పంపాలని విద్యాధికారులను ఆదేశించారు. సైన్స్ పరికాలపై విద్యార్థులకు అవగా హన వచ్చేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామ న్నారు. విద్యార్థులు తయారు చేసిన సైర విద్యుత్, పవన విద్యుత్, ధర్మోడైనమిక్స్, కిరణజన్య సంయోగ క్రియ విధానాలు ఆకర్షించాయి. ఆదే విధంగా ఇల్లంతకుంట పెద్దలింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ల్యాగల శ్రీలేఖ వైర్లెస్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు, గంభీరావుపేట దమ్మనపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఇ మధుప్రియ ‘నా ఇన్నోవేషన్ దివ్యాంగన మిత్ర సా నిటరీ నాప్కిన్’ తయారు చేసి అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.