Share News

విద్యార్థినులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:16 AM

విద్యార్థినులు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరి మా అగర్వాల్‌ ఆకాంక్షించారు.

విద్యార్థినులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

తంగళ్లపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరి మా అగర్వాల్‌ ఆకాంక్షించారు. తంగళ్లపల్లి టీఎంఆర్‌ ఐఎస్‌ విద్యాల యంలో మంగళవారం మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, బాల కార్మిక నిర్మూలన అంశాలపై ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇంటర్‌ విద్యార్థులు ఏమి చదువుతున్నారు? తర్వాత ఏమి చదువుతా రు? వారు ఆసక్తి ఏంటి? అని ఇన్‌చార్జి కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నా రు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అం దజేశారు. పలువురు టీచర్లకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ను నిర్వాహకులు సన్మానించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ మాట్లాడారు. ప్రతి విద్యార్థిని నిత్యం తమ విద్యాలయంలోని లైబ్రరీలో బుక్స్‌, దిన పత్రి కలు చదవాలని సూచించారు. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండా లని, పుస్తకాలకు దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థిని కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నా సరే అత్యున్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యతోనే వ్యక్తిగత, సామాజిక మార్పు సాధ్య మని పేర్కొన్నారు. పలు ఉదాహరణలు వివరించారు. మంచిగా చది వే వారికే ఉన్నత అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. అన్ని తరగ తుల సిలబస్‌ ఫిబ్రవరిలోగా పూర్తిచేయాలని, గత పది సంవత్సరాల బోర్ట్‌ పరీక్ష పేపర్స్‌ తీసుకొని, ఫైనల్‌ పరీక్ష వరకు సాధన చేయించా లని ఆదేశించారు. ఈ విద్యాలయం నుంచి విద్యార్థులు వచ్చే ఏడాది పలు జాతీయ విద్య సంస్థల్లో సీటు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థిని మంచిగా విద్యను అభ్యసించి టీచర్‌, లాయర్‌, ఇంజ నీర్‌, డాక్టర్‌ తదితర వృత్తులు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడాలని, ఆర్థి కంగా స్వతంత్రత సాధించాలని సూచించారు. ఇష్టపడి చదివి.. ప్రతి సబ్జెక్టులో రాణించాలని, పోషకాహారం నిత్యం తీసుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ స్వప్న, తహసీల్దార్‌ జయంత్‌, ప్రిన్సిపాల్‌ ఉర్సా ఫాతిమా. మైనార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:16 AM