Share News

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:58 AM

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుతూ భవిష్యత్తులో ముందుకు సాగాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుతూ భవిష్యత్తులో ముందుకు సాగాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. ఇంటర్మీడియేట్‌ ఫలితాలు విడుదల కాగా వేములవాడ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాల యానికి చెందిన హేమంత్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంఎల్‌ టీలో 496 మార్కులు సాఽధించి రాష్ట్ర మొదటి ర్యాంక్‌ను సాధిం చాడు. అలాగే ఎల్‌ఎండీటీలో అదిల్‌షరీఫ్‌ 483 మార్కులు సాధిం చి రాష్ట్ర రెండో ర్యాంక్‌లను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎల్‌ఎండీటీలో ఎండా షారుక్‌ 969, ఎంఎల్‌టీలో సంజయ్‌ 962 లతో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించారు. వీరితోపాటు ద్వితీయ సంవత్సరంలో 31కి 16మంది విద్యార్థులు 900లకు పైగా మార్కు లు సాధించారు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి భారతితో కలసి విద్యా ర్థులు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాను కలువగా వారిని అభినం దించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:58 AM