విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:58 AM
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సివి ల్ జడ్జి రాధిక జైశ్వాల్ అన్నారు.
కోనరావుపేట, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సివి ల్ జడ్జి రాధిక జైశ్వాల్ అన్నారు. కోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ ఉన్నత స్థాయికి ఎదగడానికి సోపానమని అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థుల సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, లోక్ అదాలత్ మెంబర్ సింథోజ భాస్కర్, ఆడెపు వేణు, ప్రిన్సిపాల్ రాము, సూరత్ యాదవ్ పాల్గొన్నారు.