Share News

విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:38 AM

విద్యార్థులు అన్‌లైన్‌ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని పోటీ పరీ క్షల్లో రాణించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు.

విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి

వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), జూలై 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు అన్‌లైన్‌ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని పోటీ పరీ క్షల్లో రాణించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. ఎల్లా రెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడె న్షియల్‌ పాఠశాలలో ఆన్‌ అకాడమీ పేరుతో జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పోటీ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌ తరగతులను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, స్టాక్‌ రూం, మద్యాహ్న భోజనం పరిశీలించి, సంబంధిత రికార్ఢులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించి పలు సబ్జెక్జ్‌లపై ప్రశ్నించారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌ కోచింగ్‌ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నా రు. జిల్లాలోని మిగిలిన 26 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఈ శిక్షణ ప్రారంభిప్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఇంచార్జి ప్రిన్సిపాల్‌ రాంసూరత్‌యాదవ్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు షేక్‌ గౌస్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:38 AM