Share News

విద్యార్థులు కళలు, క్రీడల్లోనూ రాణించాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:45 PM

విద్యార్థులు చదువుతోపాటు వివిధ కళలు, క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

విద్యార్థులు కళలు, క్రీడల్లోనూ రాణించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పతి

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతోపాటు వివిధ కళలు, క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళోత్సవ్‌ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబించేందుకు ఇలాంటి కార్యక్రమాలు వేదికగా ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో డీఈవో మొండయ్య, విద్యాశాఖ కో ఆర్డినేటర్లు అశోక్‌రెడ్డి, ఆంజనేయులు, జిల్లా సైన్స్‌ అధికారి జయపాల్‌రెడ్డి, జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు. అనంతరం కళోత్సవంలో భాగంగా జిల్లా సైన్స్‌ మ్యూజియంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన కథలు చెప్పడం, దృశ్య కళల పోటీలను ్ల కలెక్టర్‌ పమేలా సత్పతి పరిశీలించారు.

ఫ జిల్లా స్థాయి కళోత్సవ్‌ విజేతలు వీరే....

విజివల్‌ ఆర్ట్స్‌ సోలో టూడిలో వి సహస్ర (జడ్పీ హెచ్‌ఎస్‌ కొత్తపల్లి), విజివల్‌ ఆర్ట్స్‌ సోలో త్రీడిలో వి సాయిచరణ్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ చంజర్ల), విజివల్‌ ఆర్ట్స్‌ గ్రూప్‌లో డి విశ్వ, ఎం కల్యాణ్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ గంగాధర), ట్రెడిషనల్‌ స్టోరీ టెల్లింగ్‌ వి అభిరామ్‌ అండ్‌ టీమ్‌ (టీజీఎంఎస్‌ రుక్మాపూర్‌), థియేటర్‌ గ్రూప్‌ ఎం రమాదేవి అండ్‌ టీమ్‌ (కేజీబీవీ చొప్పదండి), క్లాసికల్‌ సోలో హిమవర్షిణి (అల్ఫోర్స్‌, కొత్తపల్లి), ఫోక్‌ గ్రూప్‌ వి శ్రీహా అండ్‌ గ్రూప్‌ (టీజీఎంఎస్‌ గంగాధర), ఇన్‌స్ట్రుమెంటల్‌ సోలో రిథమిక్‌ రవీన్‌నాయక్‌ (పారమిత, కరీంనగర్‌), ఇన్‌స్ట్రుమెంటల్‌ సోలో మేలోడి సుస్వర మౌతిక (మానేరు, కరీంనగర్‌), ఇన్‌స్ట్రుమెంటల్‌ గ్రూప్‌ రోహిత్‌ అండ్‌ గ్రూప్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ వెన్నంపల్లి), వోకల్‌ సోలో వి శ్రీనిధి (అల్ఫోర్స్‌, కొత్తపల్లి), వోకల్‌ గ్రూప్‌ శ్రీవికాస్‌ టీం (పారమిత, కరీంనగర్‌)

Updated Date - Sep 17 , 2025 | 11:45 PM