Share News

‘స్నేహిత’తో విద్యార్థులకు భరోసా కల్పించాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:37 PM

జిల్లాలోని ప్రతి పాఠశాలలో రక్షణ, భద్రత, బాలబాలికల చట్టాలపై స్నేహిత కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో ధైర్యం, భరోసా నింపాలని కలెక్టర్‌ పమేలాసత్పతి అన్నారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్నేహిత రెండో విడత అవగాహన కార్యక్రమా లపై కళాభారతి ఆడిటోరియంలో వివిధశాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో సమన్వ య సమావేశం ఏర్పాటు చేశారు.

‘స్నేహిత’తో విద్యార్థులకు భరోసా కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పతి

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి పాఠశాలలో రక్షణ, భద్రత, బాలబాలికల చట్టాలపై స్నేహిత కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో ధైర్యం, భరోసా నింపాలని కలెక్టర్‌ పమేలాసత్పతి అన్నారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్నేహిత రెండో విడత అవగాహన కార్యక్రమా లపై కళాభారతి ఆడిటోరియంలో వివిధశాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో సమన్వ య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడుతూ బాలబాలికలకు వారి రక్షణ, భద్రతపై అన్ని పాఠశాలల్లో ఇదివరకే ఒక దఫా అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశామని అన్నారు. ప్రతిపాఠశాలలో స్నేహిత ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని విద్యార్థులు తమకు పాఠశాల సిబ్బంది నుంచి గానీ, బయట వ్యక్తుల నుంచి గానీ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు పెట్టెలో ఫిర్యాదు వేయాలని చెప్పారు. ఈ ఫిర్యాదు పెట్టెను షీటీం బృందాలు పర్యవేక్షిస్తాయని అన్నారు. బాలికల రక్షణ పట్ల తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, మానవీయ కోణంలో వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ, మెప్మా పీడీ స్వరూపరాణి, షీటీం ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత, అడిషనల్‌ డీఆర్‌డీవో రవికుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌, పలుశాఖల అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:37 PM