Share News

ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి పటిష్ట చర్యలు

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:46 AM

ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి ప్రభు త్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు.

ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి పటిష్ట చర్యలు

ముస్తాబాద్‌, అగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి ప్రభు త్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్‌ ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవ నాన్ని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కెకె మహేందర్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ డీఎంఎఫ్టీ నిధులు రూ.20 కోట్లతో జిలాల్లో మొత్తం 170 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని భవనాలు రానున్న ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇందులో భాగం గా ముస్తాబాద్‌ ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించామని వెల్లడించారు. అంగన్‌వాడీల కోసం నూతన భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తుందని పేర్కొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు..

నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని వసతులున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కెకె మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజక వర్గంలో మొత్తం 98అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అరవింద, కాం గ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అనిత, ఏ ఎంసీ ఛైర్మన్‌ తలారి రాణినర్సింలు, మాజీ ఎఎంసీ ఛైర్మన్‌ అంజనేయరావు, మాజీ ఎంపీటీసీలు గుండెల్లి శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు గజ్జెల రాజు, దీటి నర్సింలు, వె ల్ముల రాంరెడ్డి, కొండం రాజిరెడ్డి, షాదుల్‌పాపా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:46 AM