Share News

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:41 AM

జిల్లాలో రోడ్డు ప్రమా దాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్డు ప్రమా దాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని ఆయా శాఖల అధికారులతో సమీ క్షించారు. ముందుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను ఇన్‌చార్జి కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లా డుతూ, జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లను ఆర్‌ అండ్‌బీ, ఎన్‌హెచ్‌, పోలీస్‌, ట్రాన్స్‌ఫోర్ట్‌ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని ఆదేశించారు. ప్రమాదాలకు కారణమవుతున్న యూటర్న్‌లను మూసివేయాలని, రోడ్డుపై అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను చెక్‌ చేసేందుకుస్పీడ్‌ గన్స్‌లను కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో రోడ్డుకు సమీపంలో ఉన్న పాత బావులను పూడ్చివేత, రోడ్డుకు ఇరువైపులా పెరి గిన చెట్ల కొమ్మలు తొలగించే పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల వెంబడి ప్రమాదాల నివారణకు ప్రస్తుతం రేడియం స్టిక్కర్లు, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలు అధి కంగా జరుగుతున్న ప్రాంతాల్లో రేడియం సైన్‌ బోర్డు ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీఏ నాన్‌ అఫీషియల్‌ మెంబర్‌ సంగీతం శ్రీనాథ్‌, ఈఈ ఆర్‌అండ్‌బీ నరసింహాచారి, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్‌, డీపీవో షరీఫుద్దీన్‌, ఈఈ పీఆర్‌ సుదర్శన్‌రెడ్డి, జీజీహెచ్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌లలు ఖదీర్‌ పాషా, అన్వేష్‌, పోలీసు ఎక్సైజ్‌ అధికారులు, సంబంధిత సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 12:41 AM