నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు..
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:23 AM
నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బి. గీతే అన్నారు.
సిరిసిల్ల క్రైం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బి. గీతే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలతో సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు పకడ్బందీగా అమలుపరిచేందుకు కృషి చేయాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరిస్తూ తగ్గించేందుకు ప్రణాళిక ప్రకారం చర్య లు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులలో త్వరగా పరిశోధన పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్‌యాక్షన్, ఎన్‌వో పీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు చేధించాలన్నారు. రౌడీ, హిస్టరీషీట్స్ ఉన్న వారిపై నిరంతరం నిఘా పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలను భయభ్రాంతు లకు గురిచేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలన్నారు. ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారీచేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్థులపై అమలుపరచడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడంవల్ల కేసు విచారణ విజ యవంతంగా పూర్తిచేసి సకాలంలో బాధితులకు న్యాయం జరిగేందుకు అవకా శం ఉంటుందన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి శుక్రవారం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేయాలన్నారు. సాయంత్రం 6గంటల నుంచి 8గంటల వరకు తనిఖీలు చేసి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎల్లారెడ్డిపే ట సీఐ శ్రీనివాస్, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.