Share News

భారీ వర్షాల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు..

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:34 PM

రాష్ట్రంలో అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఎక్కడ కూడా ప్రాణ, అస్తి నష్టం సంభవించ కుండా అధికారులు చర్య లు తీసుకోవాలని రెవె న్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు..

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఎక్కడ కూడా ప్రాణ, అస్తి నష్టం సంభవించ కుండా అధికారులు చర్య లు తీసుకోవాలని రెవె న్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరా బాద్‌ సచివాలయం నుంచి మంత్రి శ్రీనివాస్‌రెడ్డి భారీ వర్షాలపై కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా సమీ క్షించారు. అలాగే జిల్లాలో భారీ వర్షాలు కురిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వలపై నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల నుంచి భారీవర్షాలు కొన్ని ప్రాంతా లల్లో కురుస్తున్నాయని వాతావరణ శాఖ సూచన ల ప్రకారం వరదల సమయంలో నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వరద పరిస్ధితులపై సీఎం రేవంత్‌రెడ్డి నిత్యం సమీక్షిస్తున్నారని ప్రజల కు ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా జాగ్ర త్త చర్యలు చేపట్టాలన్నారు. వరద సహాయక చ ర్యలు చేపట్టేందుకు జిల్లాకు ముందస్తుగా రూ కోటి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అవసర మైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాధాబాయ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:34 PM