Share News

మహనీయుల ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:02 AM

మహనీయుల ఆశయాలను ముందు తరాలకు తెలిసేలా చూడల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

మహనీయుల ఆశయ సాధనకు కృషి

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : మహనీయుల ఆశయాలను ముందు తరాలకు తెలిసేలా చూడల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం అంబేద్కర్‌ చౌరస్తాలోని జిల్లా గ్రంథాలయం పక్కన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. అసమానతలు, వివక్షతకు కారణం నిరక్ష్యరాత అని గుర్తించి నిరక్ష్యరాతను నిర్మూలించాలని కంకణం కట్టుకున్న ఆదర్శ దంపతులు మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే కృషి ఆదర్శప్రాయం అన్నారు. హైద రాబాద్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినిమాను చూశానని తెలిపారు. హిందీ భాషలో ఉన్న ఆ సినిమాను తెలుగులోకి అనువదించి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు చూపెట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించిన మూడు గంటల్లోనే ఆనాటి ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టడం జరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. మహా త్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాలను పెట్టాలని విజ్ఞప్తులు రావడంతో వచ్చే జయంతి వరకు విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు కలెక్టర్‌ సహకారంతో జిల్లా కేంద్రం లో వారి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి విగ్ర హాన్ని ఆవిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం జిల్లా చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, టీపీసీసీ సభ్యుడు సంగీతం శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళ జిల్లా అధ్యక్షు రా లు కాముని వనిత, రాష్ట్ర అధికార ప్రతినిధి చక్రధర్‌రెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షహన్మాండ్లు, ముది రాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, పట్టణ అధ్యక్షుడు వంకాయల కార్తిక్‌, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, పద్మశాలి పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్‌, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి రాగుల రాములు, మాజీ ప్రజాప్రతీనిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:02 AM