Share News

మహనీయుల ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:01 AM

మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తు న్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

మహనీయుల ఆశయ సాధనకు కృషి

చందుర్తి,ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తు న్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో జ్యోతిరావు పులే జయంతి వేడుకల్లో పాల్గొని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విగ్రహా నికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు పాటుపడదామన్నారు. నేటి యువ త మహనీయుల జీవితాలను తెలుసుకొని నిత్య జీవితంలో ముందుకు సాగలా న్నారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతు న్నమన్నారు. సావిత్రి బాపులె, జ్యోతిరావు పూలే విద్య ఆవశ్యకతను గుర్తించి ఆ రోజుల్లోనే ఆనేక మందికి విద్య దానం చేశారని తెలిపారు. వారు సమాజంలో అంటరాని తనాన్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బొజ్జ మల్లేశం, నాయకులు గొట్టే ప్రభాకర్‌, పులి సత్తయ్య, ఎన్గంటి శంకర్‌ దూది శ్రీనివాసరెడ్డి సొంతపూరి బాలకృష్ణ,మధు, శంకర్‌, ప్రసాద్‌, దేవస్వామి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 01:01 AM