జ్యోతిబా ఫూలే ఆశయాల సాధనకు కృషి
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:01 AM
జ్యోతిబా ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ముదిరాజ్ సంఘ నాయకుడు అంబరిపేట శంకర్‌లు పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : జ్యోతిబా ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ముదిరాజ్ సంఘ నాయకుడు అంబరిపేట శంకర్‌లు పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో ఆదివారం జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే,పండుగ సాయన్న విగ్రహాలను ఆవిష్కరించారు. ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు ఏలవేని రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేసిన ఘనత జ్యోతిబా ఫూలేకు దక్కుతుందన్నారు. తొలిమహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీబాయి ఫూలే మహిళల చదువుకోసం చేసిన కృషి ఎల్లప్పటికి గుర్తు ఉంటుందన్నారు. మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం పరిపాలనలో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు పండుగు సాయన్న అని అన్నారు. గ్రామంలో విగ్రహాల ఏర్పాటుకు దాతలు ముందుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నీలం శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ముదిరాజ్ సంఘ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, మండల శాఖ అధ్యక్షుడు ఏలవేని రమేష్, జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షుడు చొప్పరి రామచంద్రం, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, మాజీ సర్పంచ్‌లు కేతిరెడ్డి మంజుల, గొడిశెల జితేందర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ కరివెద స్వప్న, బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము రమేష్, నాయకులు కొమ్ముల ఎల్లయ్య, కరుణాల భద్రాచలం, కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, రేగుల బిక్షపతి, కొమ్ముల లచ్చయ్య, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.