Share News

వారంలోపు కూలి పెంచకుంటే సమ్మె

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:42 AM

సిరి సిల్లలో తయారుచేసే పాలిస్టర్‌ వస్త్రానికి యూజమాను లు వారంలోగా కూలి పెంచకుంటే ఉత్పత్తిని నిలిపివేసి సమ్మెలోకి వెళ్తామని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ ప్రకటిం చారు.

వారంలోపు కూలి పెంచకుంటే సమ్మె

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : సిరి సిల్లలో తయారుచేసే పాలిస్టర్‌ వస్త్రానికి యూజమాను లు వారంలోగా కూలి పెంచకుంటే ఉత్పత్తిని నిలిపివేసి సమ్మెలోకి వెళ్తామని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ ప్రకటిం చారు. పాలిస్టర్‌ వస్త్రానికి సంబంధించి మరమగ్గాల, కార్మికులు, అసాములు, వార్పిన్‌, వైపని అనుబంధ రం గాల కార్మికులకు కూలి ఒప్పందం గడువు ముగిసి 20 నెలలు గడుస్తున్నా పెంచకుండా మొండి వ్యవహరిస్తు న్న యాజమానుల వైఖరిని నిరసిస్తూ మంగళవారం సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ అఽధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పాలిస్టర్‌ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ఎదుట కార్మికులతో కలి సి నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మూషం రమేష్‌ మాట్లాడారు. డిసెంబరు 1న యజమానుల సంఘానికి 15రోజుల్లోపు కూలి పెంచాలని లేకుంటే సమ్మెకు వెళ్తామని నోటీసు ఇచ్చినప్పటికి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా యాజమానులు చర్చలు జరిపి వారం రోజుల్లోపు కూలి పెంచాలని లేకుంటే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చ రించారు. ఈ ధర్నాలో సీఐ టీయూ జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ, నాయకులు నక్క దేవదాస్‌, ఉడుత రవి, కుమ్మరి కుంట కిషన్‌, దూస అశోక్‌, సబ్బని చంద్రకాంత్‌, బెజుగం సురేష్‌, ఎలిగేటి శ్రీనివాస్‌, కోడం రవి, స్వర్గం శేఖర్‌, బింగి సంపత్‌, గడ్డం రాజశేఖర్‌, ఆడెపు మోహన్‌, చంద్రకాంత్‌, రవి, వెంకటే శ్వర్లు, సతీష్‌, సత్యం, రమేష్‌లతో పాటు మరమగ్గాల కార్మికులు ఆసాములు, వార్పిన్‌, వైపని, అనుబంధ రం గాల కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:43 AM