పకడ్బందీగా చిన్ననీటి వనరుల గణన
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:36 PM
చిన్ననీటి వనరుల గణన పకడ్బందీగా చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : చిన్ననీటి వనరుల గణన పకడ్బందీగా చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. చిన్ననీటి వనరుల గణనపై డీఆర్డీవో, వ్యవసాయ, ఈఈ పీఆర్, నీటి పారుదల శాఖ, సెస్, సీపీవో తదితర శాఖల జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీ అధికారులతో జిల్లా సమీకృత కార్యాల యాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల గణన ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని ఆదేశించారు. రెండు వేల హెక్టార్లలోపు విస్తీర్ణం ఉన్న జలవనరుల గణన మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వెల్లడించారు. ఆఫీసర్‌గా తహసీల్దార్, ఎంపీఎస్‌వో, నీటిపారుదల శాఖ ఏఈలు సూపర్‌వైజర్‌గా ఉంటారని, జీపీవో లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్‌అసిస్టెంట్లు, ఏఈవోలు ఎన్యూమరేటర్లు గా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు ఇతర జల వనరుల వివరాలు సేకరించడంపై అందరూ ఎన్యూమరేట ర్లకు ఆయా తహసీల్ కార్యాలయాల్లో తహసీల్దార్, ఎంపీఎస్‌వో, నీటి పారుదల శాఖ ఏఈలు, ఎంపీడీఓలు ఈ గణనపై 15వ తేదిలోగా శిక్ష ణ పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ ఇతర శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన వివరాలను గణన చేస్తున్న అధికారులకు అందజేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వేములవా డ ఆర్డీవో రాధాబాయి, సీపీవో శ్రీనివాసాచారి, డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్ బేగం, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిషోర్ కుమార్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.