పకడ్బందీగా మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:42 AM
జిల్లాలో మద్యం షాపుల నిర్వహణ ఆయా సామాజిక వర్గాలకు కే టాయింపును పకడ్బందీగా జరిపామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు.
- కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మద్యం షాపుల నిర్వహణ ఆయా సామాజిక వర్గాలకు కే టాయింపును పకడ్బందీగా జరిపామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. గురువారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గల మినీ ఆడిటోరియంలో 2025 - 2027 సంవత్సరాలకు సంబందించి ఏ4 కేటగిరి మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా కమిటీ సభ్యులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, డీటీఎఫ్ సీఐ రాజమౌళి, జగిత్యాల సీఐ వై సర్వేశ్వర్ రావులతో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్ 22 దుకాణాలకు డ్రా పద్థతిని నిర్వహించారు. జిల్లాలో మొత్తం 71 మద్యం దుకాణాలకు గానూ 14 మద్యం దుకాణాలు గౌడ కులస్థులకు, ఎనిమిది దుకాణాలు ఎస్సీలకు కేటాయించామన్నారు. మిగిలిన 49 దుకాణాలను జనరల్ విభాగంలో అందరికీ కేటాయించినట్లు తెలిపారు. గెజిట్ విడుదల అనంతరం ఈనెల 26వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని, వచ్చే నెల 18వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. అక్టోబరు 23న మద్యం దుకా ణాల కేటాయింపునకు డ్రా నిర్వహిస్తామన్నారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని శ్రీరాం సాగర్ క్యాంపులో గల ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యే క కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్‌ఐలు మేఘమాల, రాజేందర్, జిల్లా కమిటీ స భ్యులు, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.