Share News

పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌ ఓటర్‌ జాబితా

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:26 AM

ఎస్‌ఐఆర్‌ ఓటర్‌ జాబితాను పకడ్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధా న ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.

పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌ ఓటర్‌ జాబితా

సిరిసిల్ల కలెక్టరేట్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐఆర్‌ ఓటర్‌ జాబితాను పకడ్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధా న ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో శనివారం వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరా బాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఓటర్‌ జాబితాల తయారీపై జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్‌తో సమీ క్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 2002లో చేసిన ఎస్‌ఐఆర్‌తో 2025 స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ ఓటర్‌ జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ఎస్‌ఐ ఆర్‌ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్‌ బూత్‌ స్థాయిలో 2002ఎస్‌ఐఆర్‌ డేటాను 2025 ఎస్‌ఎస్‌ఆర్‌ డేటాతో పరిశీలిం చాలన్నారు. ఆ తర్వాతనే ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ఎస్‌ఐ ఆర్‌ జాబితా రూపకల్పన అధికారికంగా ప్రారంభం కాగానే అవస రమైన మేర ఎన్యూమరేటరీ ఫారాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రింట్‌ చేసుకుని సంబంధిత పోలింగ్‌ బూత్‌లకు పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఇంటికి రెండు ఫారాల చొప్పున బీఎల్‌వోల దగ్గర అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్‌ అధికారి, ఏఈఅర్‌వో డిప్యూటీ తహసీల్దార్‌లు, బీఎల్‌వో, సూపర్‌వైజర్‌లతో రెగ్యూలర్‌గా సమావే శాలు నిర్వహించాలని ప్రతిరోజు లక్ష్యాలను నిర్ధేశించుకుని ఎస్‌ఐ ఆర్‌ చేపట్టేలా కార్యాచరణ తయారు చేయాలని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ మాట్లాడుతూ ఎన్నికల కమి షన్‌ సూచనల ప్రకారం ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా తయారు చేసేందుకు చర్యలు చేపడుతామని వివరించారుర. ఈ సమావే శంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో రాధా బాయి, తహసీల్దార్‌లు మహేష్‌కుమార్‌, విజయప్రకాష్‌రావు, కలెక్ట రేట్‌ పర్యవేక్షకులు ప్రవీణ్‌, ఎన్నికల సెక్షన్‌ అధికారి రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:26 AM