Share News

కట్టుదిట్టంగా ‘సంకల్ప్‌’ అవగాహన కార్యక్రమాలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:20 AM

‘సంకల్ప్‌’ అవగాహన కార్యక్రమాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అధికారులను అదేశించారు.

కట్టుదిట్టంగా ‘సంకల్ప్‌’ అవగాహన కార్యక్రమాలు

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ‘సంకల్ప్‌’ అవగాహన కార్యక్రమాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం మహిళా అభ్యున్నతిపై ‘సంకల్ప్‌’ పేరిటి పది రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణపై ఎస్పీ మహేష్‌బీగీతేతో కలిసి సంబంధిత అధికారుతో కలెక్టర్‌ సమీక్షా సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 2 నుంచి 12వ తేదీవరకు పది రోజుల పాటు సంకల్ప్‌ హెచ్‌ ఈడబ్యూపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సిరిసిల్ల జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పీసీపీఎన్‌డీటీయాక్ట్‌, మహిళల సంరక్షణ కోసం ఉన్న చట్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మహిళల సంక్షే మం అభివృద్ధి కోసం రూపొందించిన పథకాలు, కార్యక్రమాలు ఇందిరా మహిళాశక్తి, అందుతున్న వివిధ ఉపాధి అవకాశాలపై ఐదు వందల మం ది మహిళలతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌పై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. అశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచరులకు సం పూర్ణ అవగాహన కల్పించి అడపిల్లలను మగపిల్లలను సమానంగా చూడా లని ఉచితంగా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలోని పాఠశాలలు, డీగ్రీ, నర్సింగ్‌, మెడికల్‌, వ్యవసాయ కళాశాలలో ప్రభుత్వం సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో జెండర్‌ సెన్నిటైజేషన్‌ కార్యక్రమం నిర్వహించాలన్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ కిషోర స్వస్ధ క్షేత్రం సందర్శించాలని, శానిటరీ పాడ్‌ వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించ డంపై అవగాహన కల్పించాలన్నారు. పనిచేసే ప్రదేశాలల్లో మహిళల సేప్టీ కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని షీ టీంల బృందాల గురించి చర్చించాలన్నారు. ప్రతి కార్యాలయంలో మహిళల వేధింపుల గురించి చర్చించేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు లీగల్‌ క్లినిక్‌ ను ఏర్పాటుచేయాలన్నారు. ఉన్నత చదువులు, నైపుణ్య శిక్షణ పోందుతున్న మహిళలతో సెల్ఫీ తీసుకుంటూ సామాజిక సమాజంలో మహిళ అభివృద్ధి గురించి ప్రచారం చేయాలన్నారు. పోస్కో యాక్ట్‌ గురించి అందిరికి తెలిసే లా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీ రాజం, డీఆర్‌డీవో శేషాద్రి, డీఈవో వినోద్‌కుమార్‌, డీపీవో షరీప్పుద్దీన్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత, సభి సెంటర్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 01:20 AM