మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:04 AM
మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం మదక ద్రవ్యాలు,డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీ మహేష్ బిగీతేతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎస్‌డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు,మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సి న కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చే యాల్సిన విస్తృత ప్రచారం వంటి పలుఅంశాలపై చర్చించారు. కలె క్టర్ సందీప్‌కుమార్‌ఝా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కస్తూర్బాగాందీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల కళా శాలలు, పాఠశాలలల్లో డ్రగ్స్ , మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్యఅధికారులతో విద్యార్థులకు అవగహన కార్యక్రమాలను నిర్వ హించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు 18 అవగా హన కార్యక్రమాలను చేపట్టామన్నారు. విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో ఎక్కడ కూడా టోబాకో, మద్యం విక్రయాలు జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో డ్రగ్స్‌టెస్ట్ నిర్వహిం చేందుకు వీలు గా పోలీసులు, ఎక్సైజ్ శాఖల వద్ద అవసరమైన మేర మూత్ర పరీక్ష ల కిట్లు అందుబాటులో పెట్టామన్నారు. డ్రగ్స్,మాదక ద్రవ్యాల ని యంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని అమలుచేయాలని కోరా రు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన కల్పిస్తూ వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివార ణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడ గంజా యి సాగు జరుగకుండా పక్కా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్నిరకాల సహాయా న్ని రద్దు చేయాలని కలెక్టర్ అదేశించారు. గంజాయి సాగు కేసులలో నిందితులకు శిక్షపడేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా చిన్నపిల్లలకు సిగరేట్,మద్యం అమ్మకుం డా చూడాలని దీనిపై గ్రాపంచాయితీల్లో తీర్మానాలు చేయాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులల్లో స్టాక్ వివరాలను ప్రతి నెలఆ తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు. చెడు అల వాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా విధానం అలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. జిల్లా ఎస్పీ మహేష్‌బిగీతే మాట్లాడుతూ జిల్లాకు గంజాయి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంలో పనిచేయాలన్నారు. జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మి కులపై నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంక టేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి అఫ్జల్‌బేగం, జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్‌కుమార్ ము న్సిపల్ కమిషనర్‌లు అన్వేష్, ఖాదర్‌పాషా అధికారులు పాల్గొన్నారు.