పాలిసెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - May 09 , 2025 | 12:08 AM
టీజీ పాలిసెట్ పరీక్ష నిర్వ హణ సజావుగా సాగే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు.
సిరిసిల్ల, మే 8 (ఆంధ్రజ్యోతి): టీజీ పాలిసెట్ పరీక్ష నిర్వ హణ సజావుగా సాగే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మే 13న పాలిటె క్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల కోసం మే 13న ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు జరిగే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అవస రమైన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామని, 2136 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నట్లు తెలి పారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రశ్నాపత్రాల తరలింపు, అవసరమైన బందోబస్తు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయా లన్నారు. పరీక్ష సమయంలో కేంద్రాల వద్ద కరెంట్ కోతలు ఉండవద్దని విద్యార్థులకు అవసరమైన రూట్లలో బస్సులు నడిచేలా చూడాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాల న్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ చంద్ర య్య, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత, ఆర్టీసీ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.