మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:13 AM
మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు జరిమానాలు తప్పవని, వాహనాదారులు జాగ్రత్తగా ఉండాలని సిరిసిల్ల టౌన్‌సీఐ కృష్ణ అన్నా రు.
సిరిసిల్ల రూరల్,నవంబరు 11 (ఆంధ్ర జ్యోతి ) : మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు జరిమానాలు తప్పవని, వాహనాదారులు జాగ్రత్తగా ఉండాలని సిరిసిల్ల టౌన్‌సీఐ కృష్ణ అన్నా రు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో తనిఖీలు చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 77మందిని మంగ ళవారం సిరిసిల్ల కోర్టులో ప్రవేశపెట్టామ న్నారు. వారికి జరిమానాలు విధిస్తూ మేజిస్ట్రేట్ జయశ్రీ తీర్పు వెల్లడించినట్లు సీఐ తెలిపారు. వీరికి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ప్రతిజ్ఞ చేయించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి రూ 6వేల చొప్పున, 25 మందికి రూ5వేల చొప్పున, ఇద్దరికి రూ 1500 చొప్పున, 47 మందికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానాలను విధించారన్నారు. ప్రతిరోజు పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహింస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులు, లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహ నాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలకు కానీ పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమనిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ దిలీప్, పోలీ సులు పాల్గొన్నారు.