Share News

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:18 AM

జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రా ల నిర్వాహకులు నిబంధనాలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రజిత అన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రా ల నిర్వాహకులు నిబంధనాలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రజిత అన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎం హెచ్‌వో డాక్టర్‌ రజిత అధ్యక్షతన గర్భస్థ పిండనిర్ధారణ నిరోధక చట్టం అమ లుపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ రజిత మాట్లాడుతూ జిల్లాలో 27 స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. స్కానింగ్‌ కేంద్రాల పనితీరు, గర్భస్థ పిండ నిర్ధారణ నిరోధక చట్టం అమలు పై కమిటీ సమావేశంలో చర్చించామన్నారు. ఫారం ఆఫ్‌ ఆడిట్‌ వివరాలపై, ఏడు స్కానింగ్‌ కేంద్రాల ధరఖాస్తులు వచ్చాయని అందులో కొన్ని రెన్యువ ల్స్‌, రిజిస్టేషన్స్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. నిబంధనలకు విరు ద్ధంగా స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే రూ.10వేలు జరిమానాతోపాటు మూడు సంవ త్సరాల పాటు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఓఎంహెచ్‌ఎన్‌ డాక్టర్‌ నాగేంద్రబాబు, డాక్టర్‌ సంపత్‌కుమార్‌, ఎన్జీవో అధ్యక్షుడు చింతోజు భాస్కర్‌, డెమో రాజ్‌కుమార్‌, సీహెచ్‌వో బాలచంద్రం, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:18 AM