Share News

పచ్చదనం వైపు అడుగులు..

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:18 AM

పచ్చదనం వైపు అడుగులు మొదలయ్యాయి. మొక్కవోని దీక్షతో రాజన్న సిరిసిల్లజిల్లాలో వివిధ గ్రామాల్లో వనమహోత్సవం సందడిగా ప్రారంభమైంది. వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు అనువైన స్థలాలను గుర్తించి వాటికనుగుణంగా మొక్కలు నాటుతున్నారు. జూన్‌లో తొలకరి జల్లులు మురిపించి ముఖం చాటేసిన తర్వాత జిల్లాలో ఏదో ఒకచోట వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు జిల్లాలో వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సంసిద్ధమయ్యారు. వివిధ గ్రామాల్లో సందడిగా మొక్కలు నాటే కార్యక్రమం చురుకుగా కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామ పంచాయతీలు,

పచ్చదనం వైపు అడుగులు..
మొక్కలు నాటుతున్న అటవీ శాఖ అధికారులు

- జిల్లాలో మొదలైన వనమహోత్సవం

- నర్సరీల్లో మొక్కలు రెడీ

- గ్రామాల్లో మొదలైన సందడి

- 10.38 లక్షల మొక్కలు నాటే లక్ష్యం

- 260 నర్సరీల్లో 12.26 లక్షల మొక్కలు

- గత సంవత్సరం ఉపాధి హామీలో నాటిన మొక్కలు 6.92 లక్షలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పచ్చదనం వైపు అడుగులు మొదలయ్యాయి. మొక్కవోని దీక్షతో రాజన్న సిరిసిల్లజిల్లాలో వివిధ గ్రామాల్లో వనమహోత్సవం సందడిగా ప్రారంభమైంది. వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు అనువైన స్థలాలను గుర్తించి వాటికనుగుణంగా మొక్కలు నాటుతున్నారు. జూన్‌లో తొలకరి జల్లులు మురిపించి ముఖం చాటేసిన తర్వాత జిల్లాలో ఏదో ఒకచోట వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు జిల్లాలో వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సంసిద్ధమయ్యారు. వివిధ గ్రామాల్లో సందడిగా మొక్కలు నాటే కార్యక్రమం చురుకుగా కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో 14 శాఖల ద్వారా 10.38 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత పదవ విడత వనమహాత్సవంలో జిల్లా వ్యాప్తంగా 7.58 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకొని పూర్తి చేశారు. 11వ వనమహాత్సవంలో జిల్లా వ్యాప్తంగా 260 గ్రామ పంచాయతీల పరిధిలోని నర్సరీల్లో 12.75 లక్షల మొక్కలు సిద్ధం చేశారు.

ఫ ఉపాధిహామీ లక్ష్యం 6.77లక్షలు

వనమహాత్సవంలో మొక్కలు నాటడం సంరక్షణలో ఉపాధిహామీ లక్ష్యమే ప్రధానంగా ఉంటుంది. 2025-26 సంవత్సరానికి 6.77 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు డీఆర్‌డీఏ ద్వారా 2020-21లో 28,53,745 మొక్కలు నాటగా 27,29,701 మొక్కలు బతికున్నాయి. 2021-2022లో జిల్లా ఉపాధిహామీ కింద 26,78,762 మొక్కలు నాటగా 25,51,234 మొక్కలు బతికి ఉన్నాయి. 2022-23 సంవత్సరంలో 19,17,248 మొక్కలు నాటగా 18,54,541 మొక్కలు బతికి ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో ఉపాధిహామీ కింద 6,92,099 మొక్కలు నాటారు. ఇందులో 6,67,980 మొక్కలు బతికి ఉన్నాయి. 2024-25 సంవత్సరానికి 6.06 లక్షల మొక్కలు నాటారు.

శాఖల వారీగా లక్ష్యాలు..

వనమహాత్సవం లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి జిల్లాలో ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలుగా పెట్టుకున్నారు. ఈసారి కూడా అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 6.77 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో 2,08,700 మొక్కలు, అటవీ శాఖ 72,000, నీటి పారుదల శాఖ 7,600, వ్యవసాయ శాఖలో 25,500, ఎక్సైజ్‌ శాఖ 27,100, విద్యాశాఖ 2 వేలు, ఉద్యానవన శాఖ 6,400, ఆర్‌అండ్‌బీ శాఖ 4 వేలు, వైద్య అరోగ్య శాఖ 2 వేలు, పోలీస్‌ శాఖ 4,600 మైనింగ్‌ శాఖ 200, పరిశ్రమల శాఖ వెయ్యి మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు.

వనమహాత్సవ లక్ష్యం...

మండలం గ్రామ పంచాయతీలు మొక్కలు

బోయినపల్లి 23 30 వేలు

చందుర్తి 19 70 వేలు

ఇల్లంతకుంట 35 76 వేలు

గంభీరావుపేట 22 76 వేలు

కోనరావుపేట 28 80 వేలు

ముస్తాబాద్‌ 22 75 వేలు

రుద్రంగి 10 10 వేలు

తంగళ్లపల్లి 30 75 వేలు

వీర్నపల్లి 17 75 వేలు

వేములవాడ రూరల్‌ 11 20 వేలు

వేములవాడ అర్బన్‌ 17 10 వేలు

ఎల్లారెడ్డిపేట 26 80 వేలు

-----------------------------------------------------------------------------------

మొత్తం 260 6.77లక్షలు

-------------------------------------------------------------------------------------------

జిల్లాలో నర్సరీల్లో మొక్కలు

మండలం గ్రామపంచాయతీలు మొక్కలు

బోయినపల్లి 23 65,200

చందుర్తి 19 1,31,400

ఇల్లంతకుంట 35 1,58,500

గంభీరావుపేట 22 1,02,700

కోనరావుపేట 28 71,600

ముస్తాబాద్‌ 22 1,30,700

రుద్రంగి 10 29,000

తంగళ్లపల్లి 30 1,56,000

వీర్నపల్లి 17 1,16,000

వేములవాడ రూరల్‌ 11 86,200

వేములవాడ అర్బన్‌ 17 33,000

ఎల్లారెడ్డిపేట 26 1,45,600

-----------------------------------------------------------------------------------

మొత్తం 260 12,26,100

--------------------------------------------------------------------------------------------

వనమహోత్సవంలో భాగస్వాములు కావాలి

- శేషాద్రి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

పచ్చదనం పెంచే మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. జిల్లాలో వివిధ గ్రామాల్లో వన మహోత్సవంలో మొక్కలు నాటడం ప్రారంభించారు. జిల్లాలో ఈసారి 10.38 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నాం. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరిగే మొక్కలు నాటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. ఇళ్లలో పెంచుకోవడానికి పండ్లు, పూల మొక్కలను కూడా అందిస్తున్నాం.

Updated Date - Jul 11 , 2025 | 01:18 AM