క్రైస్తవ మైనార్టీల సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:18 AM
క్రైస్తవ మైనార్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష న్ చైర్మన్ దీపక్‌జాన్ కోరారు.
సిరిసిల్ల కలెక్టరేట్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యో తి) : క్రైస్తవ మైనార్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష న్ చైర్మన్ దీపక్‌జాన్ కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం పాస్టర్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. క్రైస్తవ బరియల్ గ్రౌండ్స్ అభివృద్ధి, భూకేటాయింపు, చర్చిల నిర్మా ణ అనుమతులు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, క్రైస్తవ మైనార్టీలకు కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ, పీఎం15 పాయింట్ ప్రోగాంలపై చర్చిం చారు. ఈసందర్భంగా చైర్మన్ దీపక్‌జాన్ మాట్లా డుతూ క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించడం హర్షనీయమ న్నారు. క్రైస్తవుల ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమ స్యలు ఉంటే సోమవారం జరిగే ప్రజావాణిలో కార్యక్రమంలో కలెక్టర్‌కు అందించాలన్నారు. ప్రా ధాన్యత అంశంగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు. కలెక్టర్ సందీప్‌కు మార్‌ఝా మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఉత్త ర్వుల సంఖ్య 571 అను సరించి అవకాశం మేర కు భూ కేటాయింపులు చేస్తామన్నారు. భూసమ స్యలుంటే లింకు డాక్యు మెంట్స్‌లను సమర్పిస్తే పరిష్కారానికి చర్యలు తీ సుకుంటామన్నారు. పలు వురు పాస్టర్‌లు మాట్లా డుతూ సన్మాన వాటిక, కమ్యూనిటీహాల్స్, చర్చిల నిర్మాణాలకు స్థలాలను కేటాయించాలని కోరారు. వేములవాడ అర్డీవో రాధాబాయ్, జిల్లా మైనార్టీ సంక్షేమాశాఖ అధికా రి ఏంఏ భారతి, అధికారులు పాల్గొన్నారు.