Share News

ఆచార్య జయశంకర్‌ విగ్రహం ఏర్పాటుకు చర్యలు

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:51 AM

గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీటూ పీజీ పాఠశాల ఆవరణలో ఆచార్య జయశంకర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ఝా ప్రకటించారు.

ఆచార్య జయశంకర్‌ విగ్రహం ఏర్పాటుకు చర్యలు

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీటూ పీజీ పాఠశాల ఆవరణలో ఆచార్య జయశంకర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ఝా ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో శనివారం ఆచార్య జయశంకర్‌ విగ్రహ ఏర్పాటుపై కమిటీతో నిర్వహించిన సమా వేశంలో ఎస్పీ మహేష్‌ బీ గీతేతో కలిసి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఆచార్య జయశంకర్‌ చిత్రపటం ఉందని, అవకాశం ఉన్నచోట విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. గంభీరావుపేట నమాజ్‌ చెరువు వద్ద ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ విగ్రహ ఏర్పాటు గురించి చర్చించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెరువు, ఎఫ్‌టీఎల్‌లో ఎటు వంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలులేనందున జయశంకర్‌ విగ్రహం ఏర్పాటు కుదరదని తెలిపారు. విగ్రహ కమిటీ సభ్యుల అంగీకారం మేరకు గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న కేజీ టూ పీజీ పాఠశాల ఆవర ణలో ఆచార్య జయశంకర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను రోడ్లు, భవనాల శాఖ అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, పంచాయతీరాజ్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 12:51 AM