నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:12 AM
నగరంలో ఖాళీ స్థలాలు, రోడ్లపై వర్షం నీరు నిలువకుండా పారిశుధ్య అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఖాళీ స్థలాలు, రోడ్లపై వర్షం నీరు నిలువకుండా పారిశుధ్య అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం కమిషనగర్ నగరంలో పర్యటించారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డుతోపాటు పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేచేశారు. అనంతరం అల్గునూరు ప్రాంతంలోని డ్యాం ఆనకట్ట సమీపంలో నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ప్రకృతివనంలో నర్సరీని సందర్శించారు. నగరపాలక సంస్థ ద్వారా చేపట్టనున్న వనహోత్సవ కార్యక్రమానికి మొక్కలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలో పారిశుధ్య పనులను మరింత మెరుగ్గా చేయాలన్నారు. జంక్షన్ల వద్ద చెత్తాచెదారం తొలగించి డ్రైనేజీల్లో నీరు వెళ్లేలా చూడాలన్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, నగర ప్రజలకు ఎలాంటి ఎక్కడ ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.