జిల్లా కేంద్రంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు..
ABN , Publish Date - May 19 , 2025 | 12:49 AM
క్రికెట్ క్రీడాకారులు, విద్యా ర్థులకు అందుబాటులో ఉండేలా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, మే 18 (ఆంధ్రజ్యోతి): క్రికెట్ క్రీడాకారులు, విద్యా ర్థులకు అందుబాటులో ఉండేలా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం మానేరు వాగు బతుకమ్మ ఘాట్ పక్కన ఉన్న మైదానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. క్రికెట్ క్రీడాకారులతో కలసి ఆటవిడుపుగా క్రికెట్ ఆడారు. కలెక్టర్ బౌలింగ్ వేయగా ప్రభుత్వ విప్ బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయలేకపోయిందని క్రీడాకా రులు, క్రీడాభిమానులు తన దృష్టికి తీసుకవచ్చారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంపై నమ్మకం ఉందని క్రీడా మైదానం ఇవ్వాలని కోరారని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చామని, సిరిసిల్ల పట్టణానికి ఆనుకునే ఉండే విధంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి స్పోర్ట్స్ యూని వర్సిటీని వందల ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. పేదల భూములకు నష్టం లేకుండా క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతుం దన్నారు. దాదాపు 6 ఎకరాలలో 2వేల మంది క్రీడాభిమానులు కూర్చుండే విధంగా స్టేడియం ఏర్పాటు చేసుకోవడానికి అధికారు లు, క్రీడా నైపుణ్యల సలహాలతో నిర్మాణం చేపడుతామన్నారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మొదటి అడుగు వేస్తున్నామని, పట్ట ణ ప్రజలు సహకరించాలని కోరారు. క్రీడా కార్యక్రమాల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సిరిసిల్ల మానేరు వాగు సమీ పంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారా యణ, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఎండీ ఖాజా, ఆడెపు జగన్, నక్క నర్సయ్య, మాజీ కౌన్సిలర్లు యెల్లె లక్ష్మీనారాయణ, కుడి క్యాల రవికుమార్, వేముల రవి, వెంగళ లక్ష్మినర్సయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.