మెడికల్ కళాశాలలో సౌకర్యాలను పరిశీలించిన రాష్ట్ర బృందం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:13 AM
కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల, విద్యార్థుల వసతిగృహం, హాస్పిటల్‌లో ఉన్న వసతులు, కావాల్సిన సౌకర్యాలు, అవసరాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియమించిన రాష్ట్ర బృందం శుక్రవారం పరిశీలించింది.
కరీంనగర్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల, విద్యార్థుల వసతిగృహం, హాస్పిటల్‌లో ఉన్న వసతులు, కావాల్సిన సౌకర్యాలు, అవసరాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియమించిన రాష్ట్ర బృందం శుక్రవారం పరిశీలించింది. అనంతరం ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌ జ్‌లో కలెక్టర్ పమేలా సత్పతి బృందం సభ్యులతో కావాల్సిన వసతులు, సౌకర్యాలపై చర్చించారు. తదుపరి నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ బృందంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ శివరాం ప్రసాద్, రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు, టీజీఎంఐడీసీ విశ్వప్రసాద్, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీన, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శాంతన్, డాక్టర్ సునీత, డాక్టర్ అభయ్ ఆదిత్య పాల్గొన్నారు.