ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - May 09 , 2025 | 12:12 AM
ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. 19.99లక్షల విలువగల 53 సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచారన్నారు. ఈప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా, ఎల్‌వోసీల ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్ల పైచిలుకు మంజూరు చేశామన్నారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వంలో అసలు గత ప్రభుత్వంలో ఎల్‌వోసీ అంటేనే ప్రజలకు తెలియని పరిస్థితి ఉండేదని, ప్రజా ప్రభుత్వంలో లెక్కకు మంచి ఎల్‌వోసీలు ఇప్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరంగా పేదలకు మెరుగైన సేవలు అంది స్తున్నామని, నియోజకవర్గ ప్రజలకు వైద్యం పరంగా ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా నూతనంగా రుద్రంగి మండలంలో రూ.1.43 కోట్లతో, ఫాజుల్‌నగర్‌లో రూ. 1.43 కోట్లుతో ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామన్నారు.
రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు..
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా నడుస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. వర్షం పడి తడిసిన ధాన్యాన్ని కూడా తప్పకుండా కొనుగోలు చేస్తామన్నారు. కొందరు కావాలని రైతుల ముసుగులో రాజ కీయాలు చేస్తున్నారని, రైస్‌మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకుంటే ఇంటర్‌మిడిట్ గోదాంలలో ధాన్యాన్ని నిలువ చేశామన్నారు. వారం పది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నా రు. ప్రతిరోజూ అధికారులతో, రైతులతో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చూస్తున్నామని, రైతులను అడ్డం పెట్టుకుని రాజకీ యాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అంతే కాకుండా కొన్ని విషయాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, భక్తుల మనో భావాలు దెబ్బతినకుండా పద్ధతి ప్రకారం రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ది చేస్తున్నామని అన్నారు. మీరూ అందించే సూచనలు, సలహా లు స్వీకరిస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. త్వరలోనే రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయి నిబంధనల ప్రకారం పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.