ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - May 03 , 2025 | 11:41 PM
ప్రజా ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మొక్కును నాటారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం సంబం ధిత వైద్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులపట్ల వైద్యలు, సిబ్బంది గౌరవంగా ఉండా లన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. మన ప్రాం తంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా, ఎల్‌వోసీల ద్వారా ఇప్పటివరకు రూ.20కోట్ల పైచిలకు మంజూరు చేశామ న్నారు. ప్రాంతీయ ఆసుపత్రి ఎంట్రెన్స్‌లో రోగులకు ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఓపి కోసం వచ్చిన వారిక ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చ ర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసు పత్రికి వచ్చే వారికి కూర్చునేందకు వీలుగా సరిపడ కుర్చీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవి కా లం సందర్భంగా మంచినీటి వసతి, ఫ్యాన్లు అమర్చాల ని పేర్కొన్నారు. ఆసుపత్రిలో సరిపడ వైద్య సిబ్బందిని నియమిచడానికి ప్రభుత్వంతో మాట్లాడుతానని పేర్కొ న్నారు. మోకాళ్ల సర్జరీలు ఆసుపత్రిలో విజయవంతం గా పూర్తి చేయడం పట్ల వైద్యలను అభినందించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పెంచలయ్య వైద్యులు తదితరులు ఉన్నారు.
అర్చకులకు అండగా ఉంటా..
దూపదీప నైవేద్య అర్చకుల సమస్యల సాధనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రికి వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు తమ సమస్యలను ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అర్చకులకు అండగా ఉంటా నని, అర్చకుల సమస్యల సాధనలో తన వంతు సహకారం అందిస్తానని హామిచ్చారు. ప్రభుత్వ విప్‌ను కలిసిన వారిలో బిట్కూరి గోపాలకృష్ణ, గంగళ్ల ఉమా శంకర్, చర్లపల్లి సీతరాములు, లక్ష్మీకాంతం, దాశరధి తదితరులు ఉన్నారు.