ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:13 AM
ప్రజల ఆరోగ్యానికి, ఆహ్లాద వాతావరణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యానికి, ఆహ్లాద వాతావరణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలో కోటి రూపాయలతో నిర్మించనున్న చిల్డ్రన్ పార్క్ ఏర్పాటుకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనిఒత్తిడితో కూడిన నేటి సమాజం పార్క్‌లు, జిమ్ లు అత్యంత ఆవశ్యకరమన్నారు. అనంతరం రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒమేగా సుశృత ఆస్పత్రి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో కమిషనర్ మనోహర్ గౌడ్, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగా ర్జున, పీఏసీఎస్ చైర్మన్‌లు ఏనుగు మల్లారెడ్డి, రాజలిం గం, దీటి రాజరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హ న్మాండ్లు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవిఅచ్యుత రావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు చారి, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, ఆస్పత్రి సూపరింటెండెంట్ శశికాంత్‌రెడ్డి, డాక్టర్ రజిత, డాక్టర్ రంగనాథ్, పడిగెల రవీందర్ రెడ్డి, రవీందర్‌రావు, కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- విద్యార్థినికి అభినందన..
ఇటీవల వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్‌లో ద్వితీయ స్థానం సాధించిన కిష్టంపేటకు చెందిన మంగళారపు సహస్రను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా సహస్రను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు కోల శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ తిరుపతి గౌడ్, కోచ్ రామాంజనేయులు పాల్గొన్నారు.