Share News

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలి

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:56 AM

రాష్ట్ర అవతరణ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణంలో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలి
అవతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణంలో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద ముఖ్య అతిఽథిగా హాజరు అవుతారని కలెక్టర్‌ తెలిపారు. ఉదయం 9.45గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుంటారని, ఉదయం 9 .50గంటలకు గౌరవ వందనం, అనంతరం అమరవీరులకు నివాళి అర్పిస్తారన్నారు. ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, జాతీయ, తెలంగాణ గీతాలాపన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఉదయం 10.11నుంచి 10.15 గంటలవరకు పరేడ్‌ ఉంటుందని, అనంతరం ముఖ్య అతిథి తన సందేశం అందిస్తారని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు. వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేయాలని ఆదేశించారు. సౌండ్‌ సిస్టం, విద్యుత్‌ సరఫరా, వేదిక, టెంట్‌, బ్యారికేడ్లు వంటి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ డి వేణు, డీసీపీ కరుణాకర్‌, ఏసీపీ గజ్జి కృష్ణ, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌ అధికారి బి గంగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:56 AM