ఉపాధిహామీ పనుల్లో సిబ్బంది చేతివాటం
ABN , Publish Date - May 13 , 2025 | 11:58 PM
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనుల్లో సిబ్బం ది చేతివాటం చూపగా సామాజిక తనిఖీల్లో అవకతవకలు బయటపడ్డాయి.
వీర్నపల్లి, మే 13 (ఆంధ్రజ్యోతి) : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనుల్లో సిబ్బం ది చేతివాటం చూపగా సామాజిక తనిఖీల్లో అవకతవకలు బయటపడ్డాయి. మండ ల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి ఉపాధిహామీ పనులపై అధికారులతో కలిసి మంగళవారం ప్రజా వేదిక నిర్వహించారు. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ.7.6 కోట్లకు సంబంధించి చేపట్టిన పనులపై ఎస్‌ఆర్‌పీ బాలు నాయక్ ఆధ్వర్యంలో గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీ జరిగింది. తనిఖీల్లో మస్టర్లను దిద్దడం, కొలతలు తప్పుగా రాయడం, ఒకరు చేసిన పనులకు మరొకరి పేరిట బిల్లులు జమచేసినట్లు ఆడిట్ బృందం గుర్తించింది. దీంతో డీఆర్‌డీవో మొత్తం రూ.21వేలను రికవరీ ఆదేశించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, ఇన్‌చార్జి ఎంపీడీవో అబ్దుల్ వాజిద్, విజిలెన్స్ మేనేజర్ అరుణ్, ఏపీవో శ్రీహరి, క్యూసీ నవీన్, ఏఈ పీఆర్ శ్రీనివాస్, అంబుడ్స్‌మెన్ రాకేష్, పంచా యతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.