వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవం
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:15 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల జయజయధ్వానాలతో 30 అడుగుల ఎత్తుతో ఉన్న రథంలో స్వామివారిని సిరిసిల్ల పట్టణంలో ఊరేగించారు. రథయాత్రను చూడడానికి సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల,
సిరిసిల్ల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల జయజయధ్వానాలతో 30 అడుగుల ఎత్తుతో ఉన్న రథంలో స్వామివారిని సిరిసిల్ల పట్టణంలో ఊరేగించారు. రథయాత్రను చూడడానికి సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. భక్తులు రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. ప్రతియేటా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మో త్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి.
మహారఽథంపై శ్రీస్వామి వారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పంటలతో రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం దేవాలయం సిబ్బంది, అర్చకులు ఆది శ్రీనివాస్‌ను సన్మానించారు. ఆయన వెంట మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, టీపీసీసీ కో ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు కాముని వనిత, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, మాజీ కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.
రథోత్సవంను సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ముందుగా స్వామి వారిని దర్శించుకొని కేటీఆర్ పూజలు నిర్వహించారు. నాప్స్‌కాబ్ చైౖర్మన్ కొండూరి రవీందర్‌రావు, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పట్టణ మహిళ విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, మాజీ కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని జిల్లా జడ్జి డి నీరజ, ఎస్పీ మహేష్ బీ. గితే వేర్వేరుగా దర్శించుకున్నారు.
రథోత్సవంకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోభస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పెద్ద బజా రు, గాంధీచౌక్, అంబేద్కర్‌నగర్ నుండి వాహనాలు రాకుండా పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం రద్దు చేయడంతో భక్తులు మండిపడ్డారు.