మానసికోల్లాసానికి క్రీడలు దోహదం..
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:55 AM
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజం అని ఓడిన క్రీడాకారులు నిరుత్సాహ పడవద్దని అన్నారు. జిల్లా స్థాయి టేబుల్ టెన్సిస్ పోటీలు వివిధ క్యాటగిరీల వారిగా పోటీలను నిర్వహించారు. అండర్-11, 13, 15, 17, 19 విభాగాలలో బాలబా లికలతో పాటు సీనియర్స్ కేటగిరిలో మహిళలు, పురుషులకు పోటీలను నిర్వహించారు. పోటీలలో విజేతలకు మెడల్స్‌ను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అజీమ్ ఉద్దీన్, కార్యదర్శి మొహమ్మద్ మునీరుద్దీన్, అబ్జర్వర్ బొల్లి సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, సరిత, ప్రభాకర్, విద్యార్థినీ విద్యార్థులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.